'వీ ట్రాన్స్ ఫర్' ను నిషేధించిన ప్రభుత్వం

వీ ట్రాన్స్ ఫర్ ను నిషేధించిన ప్రభుత్వం
x
Highlights

ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ WeTransfer.comని టేలీకమ్యూనికేషన్స్ విభాగం (DoT) నిషేధించింది.

ప్రముఖ ఫైల్ షేరింగ్ సైట్ WeTransfer.comని టేలీకమ్యూనికేషన్స్ విభాగం (DoT) నిషేధించింది.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బ్యాన్ చేసినట్టు డిఓటి పేర్కొంది. ముంబై మిర్రర్ వార్తాకథనం ప్రకారం, దేశంలోని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లకు మూడు URL లను నిషేధించాలని DoT నోటీసు జారీ చేసింది. మొదటి రెండు నోటీసులు వెబ్‌సైట్‌లో రెండు నిర్దిష్ట URL లను నిషేధించాలని ఆదేశించగా, మూడవ నోటీసు మాత్రం మొత్తం WeTransfer వెబ్‌సైట్‌ను నిషేధించాలని ఆదేశించింది.

WeTransfer అనేది వెబ్‌లో ఒక ప్రముఖ ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది, ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ రోజులలో కంపెనీ భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందింది. ఈ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు 2GB వరకు ఫైళ్ళను ఇమెయిల్‌కు పంపించుకోవచ్చు, ఇందుకోసం ప్రత్యేక ఖాతాను సృష్టించాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో పెయిడ్ ప్లాన్ గనక తీసుకున్నట్లయితే 2GB కన్నా ఎక్కువ ఫైల్-షేరింగ్ కు అనుమతిస్తుంది, అయితే చాలా మంది వినియోగదారుల పని ఉచిత ప్రణాళిక ద్వారానే జరుగుతుంది. దీంతో వెబ్‌సైట్ దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. అలంటి వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించిందనే దానిపై స్పష్టత లేదు, చాలా ప్రముఖ ISP లు తమ వినియోగదారులకు WeTransfer యాక్సెస్‌ను నిరోధించాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories