ప్రభుత్వం ఆధార్ PVC ఒరిజినల్... ఇలా ధరఖాస్తు చేసుకోవాలి.. ఇవి ప్రయోజనాలు..
ప్రభుత్వం ఆధార్ PVC ఒరిజినల్... ఇలా ధరఖాస్తు చేసుకోవాలి.. ఇవి ప్రయోజనాలు..
Aadhar Original PVC Card: ఇటీవల కాలంలో ప్రభుత్వం రూపొందించిన పథకాలకు సరిపడా డూప్లికేట్ కార్డులు వేలకొలది పుట్టుకొస్తున్నాయి... డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర్నుంచి ఆధార్ కార్డు వరకు ఇలా అన్ని రకాల కార్డులను పీవీసీలో తయారు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో మరికొంతమంది ఫొటోలు, చిరునామాలు మార్ఫింగ్ చేసి, అడ్డదారులు తొక్కేవిధంగా ప్రోత్సహిస్తు.. అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నేరుగా లబ్ధిదారునికి ఆధార్ పీవీసీ కార్డు ఇచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీటికి కొన్ని అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ రూపకల్పన చేసింది. అయితే వీటిని లబ్ధిదారుడు ఏ విధంగా పొందాలనే దానిపై ప్రత్యేకంగా వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని వివరిస్తూ ప్రకటన చేసింది...
కొత్తగా వస్తున్న ఆధార్ PVC కార్డ్ లో సరికొత్త భద్రతా ఫీచర్లు ఇన్‌స్టాల్ చేశారు. QR కోడ్ ద్వారా చేసే తక్షణ ఆఫ్‌లైన్ ధృవీకరణ మరొక గొప్ప ఫీచర్.
ఆధార్ PVC కార్డ్
ప్రభుత్వ సంస్థ UIDAI తన వెబ్‌సైట్ నుండి ఆధార్ యొక్క PDF కాపీని తీసుకొని ప్లాస్టిక్ కార్డ్ ని తయారు చేయడం, చట్టబద్దత కాదని ఇటీవల ప్రకటించింది . మీరు ఇప్పటికే అలాంటి కార్డు పొంది ఉంటే, అది ఇక నుంచి చెల్లు బాటు కాదని తేల్చి చెప్పింది. మీకు పీవీసీ ఆధార్ కావాలంటే UIDAI తన వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా, నేరుగా ఇంటి చిరునామాకే పొందవచ్చు. దీని కోసం కేవలం రూ. 50 ఖర్చు అవుతుంది. ఆధార్ PVC కార్డ్ ని పొందడానికి ఏమి చేయాలి? దాని వల్ల పొందే ప్రయోజనాలేమిటి? అనే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
UIDAI ఇటీవల ఒక ట్వీట్‌లో బహిరంగ మార్కెట్ నుండి తయారు చేయబడిన ఆధార్ ప్లాస్టిక్ కార్డులు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.. ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేని కారణంగా ఈ రకమైన కార్డులకు అందరూ దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. జనవరి 20న UIDAI జారీ చేసిన మరో ట్వీట్‌లో ప్రభుత్వం అందించే ఆధార్ PVC కార్డ్ ఎలా ఉంటుంది? దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించింది. UIDAI యొక్క ఆధార్ కార్డ్ నీటిలో తడిసినా ఏమీ కాదని పేర్కొంది. నాణ్యమైన ప్రింటింగ్, లామినేషన్ చేసి ఇవ్వబడుతుంది. ఎక్కడైనా వాడుకునే విధంగా దీన్ని రూపిందించారు. వర్షంలో తడిసినా ఇది ఏమీ కాదని పేర్కొంది.
ఆధార్ PVC కార్డ్ ప్రయోజనాలు
ఆధార్ PVC కార్డ్‌లో సరికొత్త భద్రతా ఫీచర్లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి,
QR కోడ్ ద్వారా చేసే తక్షణ ఆఫ్‌లైన్ ధృవీకరణ మరొక గొప్ప ఫీచర్. ఇది స్కానర్ సహాయంతో తక్షణమే ధృవీకరించబడుతుంది, దీని కోసం ఇంటర్నెట్ అవసరం లేదు.
ఈ ఆధార్ PVC కార్డ్ ఆన్‌లైన్‌లో ఎలా ఆర్డర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ముందుగా మీరు https://uidai.gov.in లేదా https://resident.uidai.gov.in ని సందర్శించాలి
2. తర్వాత ఆర్డర్ ఆధార్ కార్డ్ సర్వీసెస్‌పై క్లిక్ చేయండి
3. ఇప్పుడు మీ 12 నంబర్ ఆధార్ లేదా 16 నంబర్‌కు చెందిన వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID) లేదా 28 నంబర్ యొక్క ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ IDని నమోదు చేయండి.
4. భద్రతా కోడ్‌ని నమోదు చేయండి
5. మీకు OTP ఉంటే, I have TOPT అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీని కోసం మీరు చెక్ బాక్స్ లో కూడా క్లిక్ చేయవచ్చు
6. అభ్యర్థన OTP బటన్‌పై క్లిక్ చేయండి
7. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో అందుకున్న OTP లేదా TOTPని నమోదు చేయండి
8. షరతులు చెక్ బాక్స్ లో క్లిక్ చేయండి
9. OTP లేదా TOTP ధృవీకరణను పూర్తి చేయడానికి సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి
తదుపరి స్క్రీన్‌లో ఆధార్ వివరాల ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకసారి పరిశీలించండి. అన్నీ సరిగ్గా ఉంటే, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి కొనసాగండి
మేక్ పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చెల్లింపు గేట్‌వే పేజీకి వెళుతుంది.. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI వంటి చెల్లింపు ఎంపికలను చేస్తారు.
10. విజయవంతమైన చెల్లింపు తర్వాత, డిజిటల్ సంతకంతో కూడిన రసీదు వస్తుంది... ఈ రశీదు PDF ఫార్మాట్‌లో ఉంటుంది. SMS ద్వారా సేవా అభ్యర్థన నంబర్‌ను మీ ఫోన్ కు వస్తుంది.
11. సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ని ఉపయోగించి మీరు ఆధార్ డెలివరీని ట్రాక్ చేయవచ్చు. ఆధార్ PVC పంపిన తర్వాత, మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. మీరు DoP వెబ్‌సైట్ నుండి ఆధార్ డెలివరీ స్థితిని పరిశీలించవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire