Coronavirus: విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు..

Good News for Travellers Arriving in India
x

Coronavirus: విదేశీ ప్రయాణికులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఐసోలేషన్ కేంద్రాల్లో ఉండక్కర్లేదు..

Highlights

Coronavirus: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ ​నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Coronavirus: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఐసోలేషన్ ​నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్​పోర్ట్​లో జరిపిన టెస్ట్‌లో పాజిటివ్ ​వచ్చిన వారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం​తప్పనిసరి కాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వారు సాధారణ కొవిడ్​ ప్రోటోకాల్ ​అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది.

ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు సూచించింది. అయితే సవరించిన మార్గదర్శకాలు మినహా మిగతా నిబంధనల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా తాజా నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

స్క్రీనింగ్ సమయంలో వైరస్​ లక్షణాలను గుర్తించినట్లయితే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్​కు వెళ్లాలని కొవిడ్ ప్రొటోకాల్​ చెబుతోంది. అంతేగాకుండా వారి ప్రైమరీ కాంటాక్ట్​లను కూడా గుర్తించి పరీక్షలు నిర్వహించాలి. భారత్​కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్​వచ్చిన తరువాత ఏడు రోజులు హోం క్వారెంటైన్​లో ఉండాలి. 8వ రోజు నెగటివ్​ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories