Petrol Diesel Rates: సామాన్య ప్రజలకు అదిరే శుభవార్త..తక్కువ ధరకే పెట్రోల్, డీజీల్

Petrol Diesel Rates: సామాన్య ప్రజలకు అదిరే శుభవార్త..తక్కువ ధరకే పెట్రోల్, డీజీల్
x
Highlights

Petrol Diesel Rates: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలోనే పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రజల ఖర్చుల్లో పెట్రోల్, డీజిల్ కే ఎక్కువ...

Petrol Diesel Rates: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలోనే పెట్రోల్, డీజీల్ ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రజల ఖర్చుల్లో పెట్రోల్, డీజిల్ కే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ ధరలు నిత్యం పెరుగుతుండంతో ప్రజా రవాణా కూడా భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి..ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సన్నాహాలను ప్రారంభించింది.

దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో రానున్న రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అర్థమౌతోంది. ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు సైతం చెబుతున్నారు. కాగా ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను సవరించింది. రూ. 2 వరకు తగ్గించింది. అప్పటి నుంచి ధరలు అలాగే కొనసాగుతున్నాయి. కాబట్టి ఈ కొత్త తగ్గింపు అంతకంతకూ పెరుగుతున్న ఇంటి, వ్యాపార ఖర్చులను తగ్గించి ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.

మరోవైపు పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు డీలర్ కమిషన్లను పెంచాలని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో చాలా కాలంగా ఉన్న పెట్రోల్ పంప్ ఆపరేటర్ల డిమాండ్ నెరవేరినట్లయ్యింది. చెప్పినట్లుగా డీలర్ల కమిషన్లను ప్రభుత్వం పెంచింది. కాగా నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేదు. పెట్రోల్ ధర రూ. 107.46 , డీజిల్ ధర రూ. 95.70 గా ఉంది. వచ్చే ఏడాది ఈ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories