రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి మళ్లీ ఆ సేవలు ప్రారంభం..

Good News for Railway Passengers Facility of Lenin Blankets Bedroll Services to Passengers
x

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. చింతించకండి మళ్లీ ఆ సేవలు ప్రారంభం..

Highlights

Indian Railway: ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా సంస్థ. రోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది...

Indian Railway: ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా సంస్థ. రోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. భారతదేశంలో మొత్తం 12,167 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. దేశంలో ప్రతిరోజూ 23 మిలియన్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే దూర ప్రయాణాలు చేసేవారు దుప్పట్లు, దిండ్లు లేకపోవడంతో చాలా ఇబ్బందిపడుతున్నారు. కరోనా వల్ల 2020లో ఈ సౌకర్యాలని రైల్వే ఆపివేసింది. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. అన్ని రైల్వే జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది.ఈ సందర్భంగా ఈ వస్తువుల సరఫరా తక్షణమే అమలులోకి వస్తుందని రైల్వే బోర్డు తెలిపింది.

కోవిడ్-19 కేసులు పెరిగిన తర్వాత AC కోచ్‌లలో ఇచ్చే సౌకర్యాలన్నింటిని ఆపివేసింది. ఇప్పుడు నెమ్మదిగా అన్నిటిని తిరిగి ప్రారంభిస్తుంది. అలాగే మార్చి 27 నుంచి అంతర్జాతీయ విమానాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని కూడా భావిస్తోంది. రైల్వేశాఖ ఈ చర్యతో కోట్లాది మంది ప్రయాణికులు మునుపటిలా చౌక టిక్కెట్లతో ప్రయాణం చేయగలుగుతారు. స్టేషన్‌కు వెళ్లి కౌంటర్‌ నుంచి టికెట్ తీసుకొని వారి గమ్యస్థానానికి బయలుదేరుతారు.

ఈ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత సీనియర్ సిటిజన్లకు మునుపటిలా రాయితీ కూడా ఇస్తారు. అలాగే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. డిసెంబర్‌లో పెరుగుతున్న చలి, పొగమంచు కారణంగా యుపి, బీహార్, ఎంపి, జార్ఖండ్‌లకు వెళ్లే అనేక రైళ్లు రద్దు చేశారు. ఇప్పుడు ఈ రైళ్లను మార్చి 1 నుంచి మళ్లీ ప్రారంభించారు. ఈ నిర్ణయంతో కోట్లాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పుడు ఏసీ కోచ్‌లలో దుప్పట్లు, కర్టెన్‌లను అందించడానికి నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులకు ఎంతో ఊరట లభించినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories