New Wage Code: ఉద్యోగులకి గుడ్‌న్యూస్‌.. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతన కోడ్‌ అమలు చేసే అవకాశం..!

Good News for Employees Implementation of New Wage Code in this Financial Year | Live News
x

New Wage Code: ఉద్యోగులకి గుడ్‌న్యూస్‌.. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతన కోడ్‌ అమలు చేసే అవకాశం..!

Highlights

New Wage Code: వేతన కోడ్‌కు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ అన్ని రంగాల హెచ్‌ఆర్ హెడ్‌లతో చర్చిస్తోంది...

New Wage Code: వేతన కోడ్‌కు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ అన్ని రంగాల హెచ్‌ఆర్ హెడ్‌లతో చర్చిస్తోంది. గతేడాది నుంచి అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా వల్ల ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. అయితే ఈ ఏడాది అమలులోకి వస్తుందని అందరు భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాల అధికారులతో సాధ్యా సాధ్యాల గురించి చర్చలు నిర్వహిస్తున్నారు. అలాగే కొత్త కార్మిక చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్టు సమాచారం. అంటే జీతం విషయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. దీంతో పాటు కార్మికుల, సామాజిక భద్రతా సంక్షేమ వ్యవస్థపై కూడా పని జరుగుతోంది. కొత్త లేబర్ కోడ్‌ను 2019లో పార్లమెంట్ ఆమోదించిన సంగతి తెలిసిందే.

సంవత్సరంలో సెలవులు 300కి పెరుగుతాయి

కొత్త రూల్ ప్రకారం ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్‌ను 240 నుంచి 300కి పెంచవచ్చు. లేబర్ కోడ్ నియమాలలో మార్పులకు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ యూనియన్, పరిశ్రమ ప్రతినిధుల మధ్య అనేక నిబంధనల గురించి చర్చలు జరిగాయి. ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్‌ను 240 నుంచి 300కి పెంచాలని డిమాండ్‌ ఉంది.

జీతం విషయంలో మార్పులు

కొత్త వేతన నియమావళి ప్రకారం.. ఉద్యోగుల వేతన నిర్మాణంలో మార్పు ఉంటుంది. వారి టేక్ హోమ్ జీతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేజ్ కోడ్ చట్టం 2019 ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక జీతం కంపెనీ (CTC) ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ శాలరీ తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు ఇవ్వడం వల్ల కంపెనీపై భారం తగ్గించుకుంటున్నాయి. దీనివల్ల ఉద్యోగికి నష్టం జరుగుతుంది.

అలవెన్సులు

ఇప్పుడు కొత్త వేతన కోడ్‌లో అలవెన్సులు మొత్తం జీతంలో 50% మించకూడదని నిర్ణయించారు. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి జీతం నెలకు రూ. 50,000 అయితే అతని బేసిక్ వేతనం రూ. 25,000. అతని అలవెన్సులు మిగిలిన రూ. 25,000లు దాటకూడదు. కొత్త వేతన నియమావళి ప్రకారం.. 12 గంటల పని 3 రోజుల వీక్లీ ఆఫ్ గురించి చర్చించారు. కానీ వారానికి 48 గంటలు పని చేయాలనే నిబంధన కచ్చితంగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories