కేంద్ర ఉద్యోగులకి శుభవార్త.. రిటైర్మెంట్‌ వయసు, పెన్షన్ పెరిగే అవకాశాలు..!

Good News Central Employees PM Economic Advisory Committee Recommend Universal Pension higher retirement age
x

కేంద్ర ఉద్యోగులకి శుభవార్త.. రిటైర్మెంట్‌ వయసు, పెన్షన్ పెరిగే అవకాశాలు..!

Highlights

Central Employees: కేంద్ర ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని...

Central Employees: కేంద్ర ఉద్యోగులకు త్వరలో శుభవార్త అందనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రతిపాదన (యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్) ప్రధానమంత్రి ఆర్థిక సలహా కమిటీ తరపున ప్రభుత్వానికి పంపారు. ఇందులో దేశంలో పనిచేసే ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం గురించి చర్చ జరిగింది. దేశంలో రిటైర్మెంట్‌ వయస్సును పెంచడంతో పాటు యూనివర్సల్ పెన్షన్ సిస్టమ్‌ను ప్రారంభించాలని ప్రధాని ఆర్థిక సలహా కమిటీ పేర్కొంది.

కమిటీ నివేదిక ప్రకారం.. ప్రతి నెల ఉద్యోగులకు కనీసం 2000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. దేశంలోని సీనియర్ సిటిజన్ల భద్రత కోసం మెరుగైన ఏర్పాట్లను ఆర్థిక సలహా కమిటీ సూచించింది. పని చేసే వయస్సు జనాభా పెరగాలంటే రిటైర్మెంట్‌ వయస్సును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. సామాజిక భద్రతా వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది చేయాలని సూచించింది. నైపుణ్యాభివృద్ధికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి విధానాలను రూపొందించాలని నివేదికలో పేర్కొన్నారు.

ఈ ప్రయత్నంలో అసంఘటిత రంగంలో నివసిస్తున్నవారు, మారుమూల ప్రాంతాలు, శరణార్థులు, శిక్షణ పొందే స్తోమత లేని వలసదారులు కూడా ఉండాలని సూచించారు. అయితే వారికి తప్పనిసరిగా శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2019 ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో దాదాపు 32 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు ఉంటారని ఒక అంచనా. అంటే దేశ జనాభాలో దాదాపు 19.5 శాతం మంది రిటైర్డ్ కేటగిరీలోకి వెళ్తారు. 2019 సంవత్సరంలో భారతదేశ జనాభాలో 10 శాతం లేదా 140 మిలియన్ల మంది సీనియర్ సిటిజన్ల కేటగిరీలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories