Gold Price: కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన 'బంగారం' ధరలు

Gold Price Increasing In India
x

Gold Price: కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన 'బంగారం' ధరలు

Highlights

Gold Price: బంగారంతో పాటు వెండి ధరకు రెక్కలు

Gold Price: దేశంలో పసిడి ధర పరుగులు పెడుతోంది. బంగారం రేటు భగభగలతో రికార్డు గరిష్ఠాలకు చేరింది. బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.68,450కు చేరింది. కనీవినీ ఎరుగుని రీతిలో పెరిగి ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠానికి చేరింది. ఒక్కరోజులోనే వెయ్యికి పైగా పెరగడంతో బంగారం ధరలకు రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా పసిడికి బలమైన గిరాకీ ఉండటంతో స్థానిక విపణుల్లోనూ బంగారం ధర పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది.

వడ్డీ రేట్లలో ఈ ఏడాది మూడు సార్లు కోత ఉంటుందని ఫెడ్‌ సంకేతాలు ఇవ్వడంతో డాలర్‌ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది పసిడి గిరాకీ పెరిగేందుకు దోహదం చేసిందని బులియన్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ఒకే రోజు రూ.1,100 మేర పెరిగి కిలో రూ.76,050కి చేరింది. రాబోయే 2 నెలల్లో పసిడి ఆభరణాలకు గిరాకీ స్తబ్దుగానే ఉండొచ్చని ప్రపంచ స్వర్ణ మండలి అంచనా వేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, పసిడి రవాణా విషయంలో తనిఖీలు పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories