పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్

పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గంభీర్
x
Gautam Gambhir
Highlights

బీజేపీ ఎంపీ, ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.

బీజేపీ ఎంపీ, ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. తన ఇంట్లో పనిచేసే పనిమనిషి అంత్యక్రియలు నిర్వాహించాడు. ఒడిషాలోని జాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సరస్వతి పత్రా గత ఆరేళ్లుగా గంభీర్ ఇంట్లో పనిచేస్తోంది. తాజాగా ఆమెకి మధుమేహం, అధిక రక్తపోటుతో ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న కారణంగా ఆమె మృతదేహాన్ని ఒడిశాలోని అమె కుటుంబానికి పంపలేకపోయారు. ఈ క్రమంలో గంభీర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని గంభీర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

"ఆమె మా ఇంట పనిమనిషి కాదు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న ఆమె ఎప్పటికీ నా కుటుంబ సభ్యురాలే. ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యతగా భావించాను. కులం, మతం, ప్రాంతం, సామాజిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను. అదే నా దేశం ఆలోచన" అంటూ గంభీర్ పేర్కొన్నాడు. గంభీర్ ఇంట్లో సరస్వతి గత ఆరు ఏళ్ల నుంచి పనిచేస్తుంది. ఇంట్లో పనిచేసే పనిమనిషి ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి కొంత డబ్బు ఇచ్చేవారే కానీ గంభీర్ ఇలా అన్ని తానై చేయడం పై ఇప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది గంభీర్ ని ప్రశంసిస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేద్ర ప్రదాన్ గంభీర్ చర్యకి హర్షం వ్యక్తం చేస్తూ .. ఇంట్లో పనిచేసే వారిని తన మనిషిగా చూడడమే కాకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించడం గంభీర్ గొప్పతనమని, ఆయన మానవతా దృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories