Covishield: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌, రెండో విడత మధ్య గ్యాప్‌ పెంపు

Gap Between two Doses of the Covishield Vaccine Increased
x

Covishield: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఫస్ట్‌, రెండో విడత మధ్య గ్యాప్‌ పెంపు

Highlights

Covishield: కరోనా టీకా కొవిషీల్డ్‌పై కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. 12 - 16 వారాల మధ్య రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

Covishield: కరోనా టీకా కొవిషీల్డ్‌పై కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. 12 - 16 వారాల మధ్య రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. పలు ప్రతిపాదనలను ప్రభుత్వ నిపుణుల బృందం పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ టీకా మొదటి డోసు తీసుకున్న నాలుగు నుంచి ఆరువారాల వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏప్రిల్‌లో ఆ సమయాన్ని ఆరువారాల నుంచి ఎనిమిది వారాలకు పెంచారు. తాజాగా మరో సారి టీకా డోసుల మధ్య గడువు పెంచుతూ మరో నిర్ణయం తీసుకున్నారు. మొదటి డోసుకు, రెండో డోసుకు నడుమ 12 వారాల గడువు ఉన్నా కొవిషీల్డ్‌ సామర్థ్యం ఉంటుందని అధ్యయణంలో తేలినట్లు తెలుస్తోంది. ఇక కొవాగ్జిన్‌ డోసుల మధ్య ఎలాంటి మార్పు జరగలేదు. అలాగే కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి 6 నెలల వరకు టీకా వేయ్యారు.

ఓ వైపు క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతుంటే మ‌రో వైపు వ్యాక్సిన్ల కొర‌త దేశాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ల కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో మొద‌టి డోసు, రెండో డోసు మ‌ధ్య గ‌డువును పెంచేందుకు నిపుణులు పరిశీలించారు. వ్యాక్సిన్ల కొర‌త‌ను కాస్తయినా అధిగ‌మించే వీలుంటుంది. రెండో డోసు తీసుకునే వాళ్లు మ‌రికొంత ఎక్కువ కాలం వేచి ఉండాల్సి రావ‌డంతో ఆ మేర‌కు మ‌రికొంత మందికి తొలి డోసు వేసే అవ‌కాశం ద‌క్కుతుంది. ఇలా వ్యాక్సిన్ల కొర‌త‌కు కాస్త చెక్ పెట్టవ‌చ్చు. ఎక్కువ గ్యాప్ త‌ర్వాత రెండో డోసు తీసుకుంటే ఎక్కువ రక్షణ ఉండ‌టంతోపాటు ఆ లోపు క‌నీసం ఒక్క డోసు తీసుకున్న వారు కాస్తయినా సుర‌క్షితంగా ఉంటారు. ఇలా రెండు ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డ‌నుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories