ముగిసిన రామ్ విలాస్ పాస్వాన్ అంత్యక్రియలు

ముగిసిన రామ్ విలాస్ పాస్వాన్ అంత్యక్రియలు
x
Highlights

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. కొడుకు చిరాగ్ పాస్వాన్ తండ్రి చితికి నిప్పంటించారు..

లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాస్వాన్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి. కొడుకు చిరాగ్ పాస్వాన్ తండ్రి చితికి నిప్పంటించారు. పాట్నాలోని దిఘా ఘాట్‌లో చివరి కర్మలు చేశారు. అంతకుముందు, పాట్నాలోని ఇంటి నుండి పాస్వాన్ పార్ధివదేహాన్ని ఆర్మీ వాహనంపై ఉంచి.. ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా 'రామ్ విలాస్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు ఆయన అభిమానులు. కాగా పాస్వాన్ మృతదేహం శుక్రవారం సాయంత్రం 7.55 గంటలకు పాట్నా చేరుకుంది.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమానాశ్రయంలోనే రామ్ విలాస్ కు నివాళి అర్పించారు. దీంతో పాశ్వాన్ మృతదేహాన్ని చూసి నితీష్ కన్నీటి పర్యంతమయ్యారు.. అనంతరం చిరాగ్ పాస్వాన్ ను ఓదార్చారు. ఇదిలావుంటే దశాబ్ధాలుగా రాష్ట్రంలోని దళిత సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కుగా ఉన్నారు రామ్ విలాస్ పాశ్వాన్. యాదవ సామాజికవర్గ బలం ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో వారికి సమానంగా దళిత, బహుజనులను రాజకీయంగా నిలదొక్కుకోవడంలో పాశ్వాన్‌ కీలక పాత్ర పోషించారు. అయన మరణాన్ని బీహార్ లోని దళిత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories