Sabarimala Pilgrims Insurance: శబరిమల భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్..రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 5లక్షలు

Sabarimala Pilgrims Insurance: శబరిమల భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్ స్కీమ్..రోడ్డు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ. 5లక్షలు
x
Highlights

Sabarimala Pilgrims Insurance: కేరళలోని శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు యాత్రికుల కోసం ఫ్రీ ప్రమాద బీమా స్కీము...

Sabarimala Pilgrims Insurance: కేరళలోని శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు యాత్రికుల కోసం ఫ్రీ ప్రమాద బీమా స్కీము తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుని తద్వారా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారము అందించనుంది.

మండలం మకర విలక్కు సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియనున్న వేళ ట్రావెల్ కోడ్ దేవస్థానం బోర్డు ఈ ప్రమాద బీమా స్కీంను ప్రారంభించింది. పథనంతిట్టా, కొల్లం అల్లప్పుజ, ఇడుక్కి జిల్లాలో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందించనుంది. దీనికి గాను యాత్రికుల గురించి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు.

వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న అందరి యాత్రికులకు ప్రమాద బీమా స్కీమ్ వర్తిస్తుంది. అందుకుగాను ట్రావెల్ కోర్ దేవస్వం బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అదనపు జిల్లాలకు కూడా బీమా పథకం విస్తరించే అంశాలపై చర్చలు జరుపుతున్నట్లు దేవస్యం బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్ తెలిపారు

శబరిమలలో పనిచేసే కార్మికుల కోసం మరో బీమా స్కీమును ప్రారంభించింది దేవస్యం బోర్డు. శబరిమలలో శుభ్రపరిచే విశుధి కార్మికులు, పంపా నుంచి సన్నిధానం వరకు భక్తులను తీసుకుని వెళలే డోలీ కార్మికులకు కూడా ఈ స్కీము వర్తిస్తుంది. ప్రమాదవశాత్తు మరణించినప్పుడు లేదా పూర్తిగా వైకల్యం సంభవించినప్పుడు రూ. 10 లక్షలు పాక్షిక వైకల్యానికి రూ.5 లక్షల పరిహారాన్ని ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సహకారంతో అందిస్తుంది

బీమా కోసం కార్మికులు రూ. 499ను ప్రీమియంను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఈ స్కీములో వారి పిల్లలకు ఫ్రీ వైద్య బీమా విద్యతోపాటు మరిన్ని ప్రయోజనాలు అందించడానికి చర్చలు కొనసాగుతున్నాయి. యాత్రికులు కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించే ప్రయత్నంలో భాగంగా ట్రావెల్ కోడ్ దేవస్థానం బోర్డు ఈ బీమా స్కీమ్స్ ను ప్రారంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories