అన్నదాతలకి అలర్ట్‌.. ఈ ప్రభుత్వ పథకాలని వినియోగించుకుంటున్నారా..!

Four Welfare Schemes for Farmers Central and State Governments are Implementing
x

అన్నదాతలకి అలర్ట్‌.. ఈ ప్రభుత్వ పథకాలని వినియోగించుకుంటున్నారా..!

Highlights

అన్నదాతలకి అలర్ట్‌.. ఈ ప్రభుత్వ పథకాలని వినియోగించుకుంటున్నారా..!

Farmers Schemes: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ రకాల పథకాలని అమలు చేస్తున్నాయి. కానీ కొంతమంది రైతులు వీటికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి రైతులని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు ఈ స్కీంలని అమలుచేస్తున్నాయి. కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలపై ప్రజలకు అవగాహన లేదు. అందులో 4 పథకాల గురించి తెలుసుకుందాం.

1. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద పొలంలో సోలార్ పంపులను అమర్చడానికి రైతులకు 60 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. ఇది మాత్రమే కాదు 30 శాతం వరకు రుణం మంజూరుచేస్తోంది. దేశంలోని రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. పొలంలో సోలార్ పంపు లేదా గొట్టపు బావిని ఏర్పాటు చేసుకోవచ్చు.

2. పీఎం కిసాన్ మాన్‌ధన్‌ యోజన

ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతినెలా రూ.3 వేల పింఛన్ కల్పిస్తోంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీరు వయస్సు ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీకు 18 ఏళ్లు ఉంటే మీరు ప్రతి నెలా రూ. 55 ప్రీమియం చెల్లించాలి.

3. పీఎం కిసాన్ యోజన

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందింది. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో అర్హులైన రైతులకు ఏటా రూ.6 వేలు అందజేస్తున్నారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది.

4. రైతు బంధు పథకం

ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతుల కోసం అమలు చేస్తోంది. దీని కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతుల ఖాతాలో ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. తమ పేరు మీద భూమి ఉన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories