Dr. Manmohan Singh: అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

Dr. Manmohan Singh: అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
x

Dr. Manmohan Singh: అధికార లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

Highlights

మన్మోహన్ సింగ్(Manmohan Singh) అంత్యక్రియలు శనివారం నిగమ్ బోధ్ ఘాట్ లో జరిగాయి. ఇవాళ ఉదయం ఎఐసీసీ కార్యాలయంలో ఆయన పార్ధీవదేహన్ని ఉంచారు.

మన్మోహన్ సింగ్(Manmohan Singh) అంత్యక్రియలు శనివారం నిగమ్ బోధ్ ఘాట్ లో జరిగాయి. ఇవాళ ఉదయం ఎఐసీసీ కార్యాలయంలో ఆయన పార్ధీవదేహన్ని ఉంచారు. ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, సీడబ్ల్యుసీ సభ్యులు మన్మోహన్ సింగ్ పార్ధీవదేహనికి నివాళులర్పించారు.

గంటసేపు పార్టీ కార్యాలయంలో ఆయన మృతదేహాన్ని పార్టీ శ్రేణుల కోసం ఉంచారు. అక్కడి నుంచి నేరుగా నిగమ్ బోథ్ ఘాట్ కు పార్థీవదేహన్ని తరలించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్,ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా,రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.మన్మోహన్ సింగ్ పార్థీవ దేహనికి త్రివిధ దళాధిపతులు నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో భూటాన్ రాజు కేసర్ నామ్ గేల్ వాంగ్ చుక్ పాల్గొన్నారు.విదేశీ ప్రతినిధులు కూడా ని మన్మోహన్ సింగ్ కు నివాళులర్పించారు.

డిసెంబర్ 26 రాత్రి ఎయిమ్స్ ఆసుపత్రిలో మన్మోహన్ సింగ్ చికిత్స పొందుతూ మరణించారు. అస్వస్థతకు గురైన ఆయనను ఎయిమ్స్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్టుగా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

1991లో పీవీ నరసింహారావు కేబినెట్ లో ఆయన ఆర్ధికశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 22014 వరకు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆర్ధిక సంస్కరణలకు ఆయన ఆద్యుడిగా చెబుతారు. 1991లో దేశంలో నూతన ఆర్ధిక పారిశ్రామిక విధానాలను అమలు చేశారు. ఆ సమయంలో భారత్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉంది.ఈ సమయంలో ఆయన అమలు చేసిన ఆర్ధిక సంస్కరణలు దేశాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేసేందుకు దోహదపడినట్టుగా ఆర్ధిక నిపుణులు చెబుతారు.

మన్మోహన్ సింగ్ స్మారకార్ధం స్థలం కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగింది. చివరకు మన్మోహన్ స్మారకార్ధం స్థలం కేటాయింపునకు సంబంధించిన రెండు, మూడు రోజుల్లో సమాచారం పంపుతామని మన్మోహన్ కుటుంబ సభ్యులకు కేంద్రం లేఖ పంపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories