Manmohan Singh Health Condition: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం

Manmohan Singh Health Condition: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత.. పరిస్థితి విషమం
x
Highlights

Manmohan Singh Health Condition: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు....

Manmohan Singh Health Condition: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇదే విషయమై పీటీఐ స్పందిస్తూ మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఎక్స్ ద్వారా వెల్లడించింది.

రాత్రి 8 గంటల ప్రాంతంలో మన్మోహన్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన అనారోగ్యానికి గల కారణం ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

మన్మోహన్ సింగ్ అస్వస్థత గురించి తెలిసి ఇప్పుడే ప్రియాంకా గాంధీ వాద్రా హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త విని ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి బయట సెక్యురిటీ కట్టుదిట్టం చేశారు.

మన్మోహన్ సింగ్ విషయంలో అందరూ గుర్తుచేసుకునే విషయం

మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత ప్రధానిగా దేశానికి సేవలు అందించారు. అయితే, అంతకంటే ముందే.. ఆయన అనేక ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్థికవేత్తగా మంచి పేరుంది. 1991-96 మధ్య కాలంలో దివంగత ప్రధాని పీవీ నరసింహా రావు హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశానికి ఆర్థికంగా ఊతం ఇచ్చాయనే పేరు తెచ్చుకున్నారు (Manmohan Singh's Economic reforms).

Show Full Article
Print Article
Next Story
More Stories