Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..7రోజులపాటు సంతాప దినాలు

Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి..7రోజులపాటు సంతాప దినాలు
x
Highlights

Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో ఢిల్లీ ఎయిమ్స్‌లో...

Manmohan Singh: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం 11గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఈ భేటీలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలియజేయనుంది. దీని తర్వాత పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్ 26 సెప్టెంబర్ 2024న 92 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ అవిభక్త భారతదేశంలో 1932 సంవత్సరంలో జన్మించారు. మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల ప్రధాన రూపశిల్పిగా మన్మోహన్ సింగ్ చెరగని ముద్ర వేశారు. మన్మోహన్ సింగ్ మార్చి 21, 1998 నుండి మే 21, 2004 వరకు సభలో ప్రతిపక్ష నాయకుని బాధ్యతలను కూడా నిర్వహించారు. 2004 నుంచి 2014 వరకు 10ఏళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలు అందించిన ఆయన ..సుదీర్ఘకాలంపాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories