Babul Supriyo: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రియో రాజీనామా

Former Central Minister And BJP MP Babul Supriyo Resigned To MP Position
x

బాబుల్‌ సుప్రియో (ఫైల్ ఫోటో)

Highlights

* బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు ఏర్పడడంతో నిర్ణయం * అసన్‌సోల్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన సుప్రియో

Babul Supriyo: కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రియో తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవిని కోల్పోవడం, బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో విభేదాలు ఏర్పడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2014 నుంచి కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన గత నెలలో పదవి పోయిన దగ్గర నుంచి నిరుత్సాహంతో ఉన్నారు. అసన్‌సోల్‌ నుంచి ఆయన రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక సామాజిక సేవలో పాల్గొంటానని, దానికి రాజకీయాలు అవసరం లేదని అన్నారు సుప్రియో.

Show Full Article
Print Article
Next Story
More Stories