Forbes 2021: కరోనా సమయంలోనూ పెరిగిన ధనవంతుల సంపద

Forbes 2021 Released Richest Man in India
x
ముకేశ్ అంబానీ (ఫైల్ ఫోటో)
Highlights

* 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్ జాబితా వెల్లడి * 775 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న దేశంలోని మొత్తం ధనవంతుల సంపద

Forbes 2021: కరోనా రెండో ఏడాది కూడా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో దేశంలోని అత్యంత ధనవంతుల సంపద విలువ మాత్రం 50 శాతం పెరిగిందని ఫోర్బ్స్‌ జాబితా వెల్లడిస్తోంది. గురువారం ఫోర్బ్స్‌ విడుదల చేసిన భారత కుబేరుల జాబితా-2021 ప్రకారం.. దేశంలోని మొత్తం ధనవంతుల సంపద 775 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2020 నుంచీ కరోనా కారణంగా పలు దశల్లో లాక్‌డౌన్‌లు విధించినా కూడా, వీరి సంపద విలువ గతేడాది కంటే 50 శాతం పెరిగేందుకు భారత ఆర్థిక వ్యవస్థ మూలాల పటిష్ఠతే కారణమని తెలుస్తోంది. చాలా కొద్ది మంది సంపద మాత్రమే గతేడాదితో పోలిస్తే తగ్గింది.

అగ్రగామి వంద మంది కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా 14వ ఏడాది తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రెండో స్థానంలో అదానీ నిలిచారు. ముఖేష్ అంబానీ సంపద 2020 నాటి 88.7 బిలియన్ డాలర్ల నుంచి 92.7 బిలియన్ డాలర్లకు పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories