Flight Accident in Kerala: ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ రన్ వే నా? గతంలో మంగళూరు ఘటనలో ఇదే తీరు

Flight Accident in Kerala: ప్రమాదానికి కారణం టేబుల్ టాప్ రన్ వే నా? గతంలో మంగళూరు ఘటనలో ఇదే తీరు
x
Flight Accident in Kerala
Highlights

Flight Accident in Kerala: కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు రన్ వే ల మీద చర్చకు తెరలేపింది. టేబుల్‌టాప్‌ రన్ వే..

Flight Accident in Kerala: కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఇప్పుడు రన్ వే ల మీద చర్చకు తెరలేపింది. టేబుల్‌టాప్‌ రన్ వే... పేరుకి తగ్గట్లే.. టేబుల్‌ ఉపరితలం మాదిరిగానే ఈ రన్‌వేలు ఉంటాయి. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ఇరువైపులా, ముందూ వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేల కంటే వీటి నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా దృష్టిభ్రాంతిని, అయోమయాన్ని కలిగిస్తాయి. పైలట్లు వెంట్రుకవాసి తప్పిదం చేసినా విమానానికి ఘోర ప్రమాదం తప్పదు.

2010 మే 22న మంగళూరు ఎయిర్ పోర్టులో సైతం దుబాయ్ నుండి వస్తున్న విమానం కూడా ఇదే విధంగా ప్రమాదానికి గురయ్యింది. విమానం రన్ వే పై నుంచి జారీ కిందపడి రెండు ముక్కలయ్యింది. ఆ సమయంలో ఈ విమానానికి మంటలు కూడా అంటుకోవడంతో 158 మంది వరకు మరణించారు. కేవలం 8 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. అక్కడ అప్పుడు ప్రమాదం జరగడానికి రన్ వే నే కారణంగా చెప్పారు. అది కూడా టేబుల్ టాప్ రన్ వే కావడం విశేషం.

ఇలాంటి రన్ వేలపై ఫైలట్ విమానాన్ని ల్యాండ్ చేసే స మయంలో ఏ చిన్న పొరపాటు చేసిన అది మృత్యుసమానమే అవుతుంది. అది నేడు నిజమయ్యింది. ప్రస్తుతానికి ఈ ఘటనకు గల కారణాలు తెలియకున్నప్పటికీ రన్ వే ఇంకోవైపు లోయ ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు మాత్రం అర్థమవుతోంది. అయితే కొన్ని సమయాల్లో ఇలాంటి మాదిరి రన్ వే వల్ల ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఇదే కాలికట్ ఎయిర్ పోర్టులో టేబుల్ టాప్ రన్ వే ఉండటం వల్ల కేరళను వరదలు ముంచెత్తినప్పుడు కొచ్చిన్ ఎయిర్ పోర్టు మొత్తం నీటిలో నిండిపోయినప్పుడు, ఇది ఎత్తైన కొండపై ఉండటంతో సహాయక చర్యలన్నీఇక్కడ నుంచే సాగాయి. ఇలాంటి టేబుల్ టాప్ రన్ వేలు చూపడానికి ఎంతో రమణీయంగా ఉంటాయి.కానీ ఇక్కడ విమానాలు దింపటానికి మాత్రం నిష్టాతులైన ఫైలట్లు అవసరం. ఏ మాత్రం చిన్నపొరపాటు జరిగినా .. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసి పోవాల్సిందే.

టేబుల్‌టాప్‌ రన్‌వేలు మన దేశంలో ఉన్నావి మూడే. కర్నాటకలోని మంగళూరు, కేరళలోని కోజికోడ్‌, మిజోరాంలోని లెంగ్‌ప్యూ విమానాశ్రయాల్లోనే టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్నాయి. టేబుల్‌టాప్‌ విమానాశ్రయాల్లో దిగడానికి అన్ని రకాల విమానాలూ అనుకూలం కూదు. షార్ట్‌ ఫీల్డ్‌ ఫెర్ఫార్మెన్స్‌(ఎ్‌సఎ్‌ఫపీ) సాంకేతికత ఉన్న విమానాలే టేబుల్‌టా్‌పపై దిగగలవు. పైలట్‌ కూడా ఈ రన్‌వేకు తగినట్లే విమానాన్ని దించాల్సి ఉంటుంది. సాధారణ రన్‌వేలపై దించినట్లుగానే టేబుల్‌టా్‌పపై దించాలని పైలట్‌ ప్రత్నించడం కూడా మంగళూరు విమాన ప్రమాదానికి కారణాల్లో ఒకటి కావడం గమనార్హం. ఈ ఇబ్బందులు వల్లనే పలు పౌర విమానయాన సంస్థలు బోయింగ్‌ 737, ఎయిర్‌బర్‌ ఏ330 వంటి విమానాలను టేబుల్‌టాప్‌ రన్‌వేలు ఉన్న విమానాశ్రయాలకు పంపడం మానుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories