Kolkata Doctor Rape and Murder Case: సందీప్ ఘోష్ సహా ఐదుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలకు అనుమతి

Kolkata rape murder case Former Principal of RG Kar Hospital arrested by CBI
x

Kolkata rape murder case: కోల్ కతా జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక మలుపు..ఆర్ జి కర్ మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్

Highlights

Kolkata Doctor Rape and Murder Case: సందీప్ ఘోష్ సహా ఐదుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలకు అనుమతి

కోల్ కతా ఆర్ జీ కార్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసులో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ సహా మరో ఐదుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐకి కోర్టు అనుమతి లభించింది. ఐదుగురికి పాలీగ్రాఫ్ పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు పాలీగ్రాఫ్ పరీక్షలకు అనుమతిని ఇచ్చింది.

ఈ నెల 9వ తేదీన కాలేజీ సెమినార్ హాల్ లో ట్రైనీ డాక్టర్ మృతదేహన్ని సిబ్బంది గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్ పోలీసుల దర్యాప్తు తీరుపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ కేసుపై దర్యాప్తు వివరాలను సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు అందించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న వైద్యులను విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ సూచనతో ఆందోళనలు విరమించి వైద్యులు విధుల్లోకి చేరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories