Ayushman Card: ఆయుష్మాన్ కార్డుతో 5 లక్షల ప్రయోజనం.. వివరాలు తెలుసుకోండి..!

Five Lakh Benefit With Ayushman Card Register Like This
x

Ayushman Card: ఆయుష్మాన్ కార్డుతో 5 లక్షల ప్రయోజనం.. వివరాలు తెలుసుకోండి..!

Highlights

Ayushman Card: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలని అమలు చేస్తోంది.

Ayushman Card: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక పథకాలని అమలు చేస్తోంది. అందులో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దేశంలోని పేద కుటుంబాలకు ఉచిత చికిత్సని అందిస్తోంది. ఆరోగ్య ఖర్చులు భరించలేని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఈ పథకం కింద చికిత్స పొందుతున్న వ్యక్తి ఆస్పత్రి ఖర్చును చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు చికిత్స పూర్తిగా ఉచితం. అయితే మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నప్పుడే దీనికి అర్హులు అవుతారు. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య పథకంగా చెప్పవచ్చు. ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు (సుమారు 50 కోట్ల మందికి) ఏటా రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఆయుష్మాన్ భారత్ కార్డును కోసం ఇలా చేయండి..?

1. ముందుగా సమీపంలోని ప్రజా సేవా కేంద్రానికి వెళ్లండి.

2. అక్కడ మీ పేరు జాబితాలో ఉందో లేదో అధికారులు తనిఖీ చేస్తారు.

3. ఆయుష్మాన్ యోజన లబ్ధిదారుల జాబితాలో మీ పేరు నమోదు అయి ఉంటే మీరు కార్డు పొందుతారు.

4. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి అన్ని పత్రాలు

ఫొటో కాపీ, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో సదరు అధికారికి సమర్పించాలి.

5. తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేస్తారు.

6. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను అందిస్తారు.

7. మీ ఆయుష్మాన్ గోల్డెన్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మీకు కార్డు చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories