Viral video : అనగనగా ఒక బాతు..

Viral video : అనగనగా ఒక బాతు..
x
Highlights

దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ అనే పాటను అందరూ వినే వుంటారు. ఈ పాటలో స్నేహం గురించి ఎంతో అద్భుతంగా రాసారు. నిజానికి పాటలో ఉన్నట్టుగానే స్నేహం అంటే...

దోస్త్ మేరా దోస్త్ తుహే మేరీ జాన్ అనే పాటను అందరూ వినే వుంటారు. ఈ పాటలో స్నేహం గురించి ఎంతో అద్భుతంగా రాసారు. నిజానికి పాటలో ఉన్నట్టుగానే స్నేహం అంటే అది ఒక విడదీయని బంధం. ఒక స్నేహితులు బాధపడుతుంటే ఓదారుస్తారు, కష్టంలో నేనున్నానని వెన్నుతడతారు. ఆపదలో ఆదుకుంటారు, ఆకలితో ఉన్నప్పుడు ఆకలిని తీరుస్తారు అదే స్నేహమంటే. అందరూ అంటారు తల్లిదండ్రులను దేవుడు నిర్ణయిస్తాడని, స్నేహితులను ఎవరికి వారే నిర్ణయించుకోవాలని అది మనషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుంది. ఇదే తరహాలో ఒక బాతు చేపలతో స్నేహం చేసింది. వాటికి ఆకలేస్తే బాతు చిరు ధాన్యాలను అందించి తన స్నేహాన్ని చాటుకుంది. నీటిలో ఉన్న చేప ఆహారం కోసం వెతుకుతుంటే అది చూసిన బాతు వాటికోసం ట్రేలో వుంచిన చిరు ధాన్యాలు త్యాగం చేసి చేప నోటికి అందించింది.

ఈ విషయాన్ని గమనించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కశ్వాన్‌ వీడియో తీసారు. దాన్ని తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. స్నేహానికి ఇంత కంటే మంచి ఉదాహరణ ఉంటే చూపించండి.. ఈ చేప ఒక మంచి స్నేహితుడిని పొందిందని ఆయన క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. స్నేహం అంటే ఇదే అనిపిస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories