Bird Flu Case: భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం

First Bird Flu case in India
x

బర్డ్‌ ఫ్లూ 

Highlights

* ఢిల్లీ ఎయిమ్స్‌లో 11 ఏళ్ల బాలుడు మృతి * హర్యానాకు చెందిన సుశీల్‌కు సోకిన బర్డ్‌ ఫ్లూ * ఐసోలేషన్‌కు వెళ్లిన వైద్యులు

Bird Flu Case: ఆధునికత వైపు పరుగులు తీస్తున్న మనుషులను రోగాలు వెంటాడుతున్నాయి. కొత్త కొత్త వైరస్‌లు అటాక్‌ చేస్తున్నాయి. కరోనా ఇంకా వదలక ముందే ఇప్పుడు బర్డ్ ఫ్లూ దేశాన్ని వణికిస్తుంది. భారత్‌లో తొలి బర్డ్‌ ఫ్లూ మరణం సంభవించింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఓ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఇప్పుడు ఐసోలేషన్‌కు వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయాలని వైద్యనిపుణులు వారికి సూచించారు.

హర్యానాకు చెందిన సుశీల్‌ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరాడు. ముందు కరోనా టెస్ట్‌ చేస్తే నెగటివ్‌గా తేలింది. వ్యాధి నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్‌ ఫ్లూగా బయటపడింది. దీంతో కాంటాక్ట్‌ ట్రేస్‌ చేయడానికి ఓ వైద్య బృందం హర్యానాలోని బాలుడి స్వగ్రామానికి వెళ్లింది.

వాస్తవానికి బర్డ్‌ ఫ్లూ.. కేవలం పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో బర్డ్‌ఫ్లూ విరుచుకపడింది. దెబ్బకు వేలాది పక్షులు బలయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. కానీ బర్డ్‌ ఫ్లూ ఓ మనిషికి సోకడం భారత్‌లో ఇదే తొలిసారి. గతంలో చైనాలోని ఓ వ్యక్తికి బర్డ్‌ ఫ్లూ సోకినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.

తూర్పు ఆసియా దేశాల్లో అక్కడక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడుతున్నాయి. అయితే మనదేశంలో మాంసాన్ని ఎక్కువ సేపు ఉడికించి తీసుకుంటాం.. దీంతో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రభావం మన దేశంలో తక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories