Bharuch COVID-19 care centre: కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం-18 మంది రోగులు మృతి

Fire Breaks out at Covid Hospital in Gujarats Bharuch 18 dead
x

Bharuch COVID-19 care centre:(File Image)

Highlights

Bharuch COVID-19 care centre: గుజరాత్‌లో రాష్ట్రంలోని భారుచ్‌లోని కొవిడ్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంలో18 మంది మృతి చెందారు.

Bharuch COVID-19 care centre: అసలే కరోనా తో ఆందోళనకు గురౌతున్న బాధితులకు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు విస్తుగొల్పుతున్నాయి. పదే పదే కోవిడ్ ఆసుప్రతుల్లో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడంలేదు. రోగాన్ని నయం చేసుకుందామని ఆసుపత్రులకు వస్తే అక్కడ కూడా నమ్మకం లేకుండా పోయిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌లో రాష్ట్రంలోని భారుచ్‌లోని కొవిడ్‌ ఆసుపత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో 50 మందికిపైగా కరోనా రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పటేల్ వెల్ఫేర్ కోవిడ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయని.. దీంతో చికిత్స పొందుతున్న 18 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని భారుచ్‌ ఎస్పీ రాజేంద్ర సింహ్‌ తెలిపారు. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

భారుచ్‌-జంబుసర్‌ రహదారిపై పక్కనున్న నాలుగు అంతస్థుల ఆసుపత్రిని పటేల్ ట్రస్ట్‌ నిర్వహిస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని కోవిడ్‌ వార్డులో అర్ధరాత్రి మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారి శైలేష్‌ సంసియా తెలిపారు. గంటలోపు మంటలు అదుపులోకి తీసుకువచ్చామని, సుమారు 50 మంది రోగులను, స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించినట్లు వివరించారు. అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. పదే పదే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం అలసత్వాన్ని మాత్రం వీడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

Show Full Article
Print Article
Next Story
More Stories