సిమ్లాలో అగ్నికి ఆహుతైన మూడంతస్థుల భవనం

సిమ్లాలో అగ్నికి ఆహుతైన మూడంతస్థుల భవనం
x
Fire Accident
Highlights

హిమాచల్ ప్రదేశ్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడంతస్థుల ఇల్లు అగ్నికి ఆహుతైంది.

హిమాచల్ ప్రదేశ్ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడంతస్థుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. సిమ్లా నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్‌హిల్‌లో ఒక ఇల్లు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో మూడు అంతస్థుల ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం రాత్రి సమయంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఇల్లు సురేంద్ర మోహన్ ఖుల్లార్ కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఈ మూడు అంతస్థుల ఇంట్లో, బెడ్ రూములు, ఫర్నిచర్-బట్టలను తొలగించారు.. ఎలాంటి ప్రాణాంనష్టం జరగలేదని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటిలో ఎక్కువ భాగం చెక్కతో తయారైనందున, మంటలు నిమిషాల్లోనే ఎక్కువ నష్టాన్ని కలిగించాయి. ఈ అగ్నిప్రమాదం సుమారు 12 నుండి 15 లక్షల వరకూ ఆస్తినష్టం చేసింది. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారించబడలేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories