Mega Food Parks: 37 మెగా ఫుడ్ పార్కులకు కేంద్రం ఆమోదం

Mega Food Parks: 37 మెగా ఫుడ్ పార్కులకు కేంద్రం ఆమోదం
x

Final approval given to 37 mega food parks: Ministry

Highlights

Mega Food Parks: ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని అందించే ల‌క్ష్యంతో దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 37 మెగా పుడ్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Mega Food Parks: ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని అందించే ల‌క్ష్యంతో దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 37 మెగా పుడ్ పార్కుల ఏర్పాటుకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు పుడ్ పార్కుల‌కు ఆమోదం తెలిపింది. ఇందులో పశ్చిమ గోదావరిలో గోదావరి మెగా ఆక్వాపుడ్ పార్క్ ఒక‌టి. ఇందులో 50 మందికి ప్రత్యక్షంగా, 200 మందికి పరోక్షంగా ఉపాధి అంద‌నున్న‌ది.

అలాగే చిత్తూరులోని శ్రీని పుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీనిలో 1200 మందికి ప్రత్యక్షంగా, 16 వేల మందికి పరోక్షంగా ఉపాధి దొర‌క‌నున్న‌ది. అలాగే తెలంగాణ‌లోని నిజామాబాద్ లో స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీని ద్వారా 25 మందికి ప్రత్యక్షంగా, 100 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంద‌ని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది.

పొలం నుంచి మార్కెట్ వరకు నిల్వతో పాటు.. ఆహార ప్రాసెసింగ్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం ఎమ్‌ఎఫ్‌పీఎస్‌(మెగా ఫుడ్ పార్క్) ప్రాథమిక లక్ష్యం. వ్యవసాయం, రవాణా, లాజిస్టిక్స్, కేంద్రీకృత ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాల కల్పన ఇందులో ఉంటుంది.

మెగా ఫుడ్ పార్కులను స్థాపించడం ద్వారా హబ్, స్పోక్స్ మోడల్ ఆధారంగా క్లస్టర్ ఆధారిత విధానంతో ఈ పథకం పనిచేస్తుంది. ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు (పీపీసీలు), కలెక్షన్ సెంటర్లు (సీసీలు).. సాధారణ సౌకర్యాల రూపంలో పొలం దగ్గర ప్రాధమిక ప్రాసెసింగ్‌, నిల్వ కోసం మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, విద్యుత్, నీరు ప్రసరించే చికిత్స ప్లాంట్ (ఇటిపి) వంటి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను ఈ పథకంలో కల్పిస్తారు.

ఈ పథకం సాధారణ ప్రాంతాలలో ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి), కష్టతరమైన కొండ ప్రాంతాలలో అంటే ఈశాన్య ప్రాంతంలో ప్రాజెక్టు వ్యయంలో 75 శాతం (భూమి వ్యయాన్ని మినహాయించి) చొప్పున మూలధన మంజూరు కోసం అందిస్తుంది. సిక్కిం, జమ్మూ కశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఐటీడీపీ రాష్ట్రాల నోటిఫైడ్ ప్రాంతాలతో సహా ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా రూ .50 కోట్లు కేటాయించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories