Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం..పాదాచారులపైకి దూసుకువచ్చిన బస్సు..ముగ్గురు మృతి..20మందికి గాయాలు

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం..పాదాచారులపైకి  దూసుకువచ్చిన బస్సు..ముగ్గురు మృతి..20మందికి గాయాలు
x
Highlights

Mumbai: ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరో 20 మందికి...

Mumbai: ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..మరో 20 మందికి గాయాలయ్యాయి. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.

ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. పాదాచారులపైకి బస్సు దూసుకురావడంతో ముగ్గురు మరణించారు 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం కుర్లా పశ్చిమ రైల్వే స్టేషన్‌ రోడ్డులోని అంబేద్కర్‌ నగర్‌లో చోటుచేసుకుంది.గాయపడిన వారిని సియోన్, కుర్లా భాభా ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బెస్ట్ రూట్ నంబర్ 332 బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి వెళ్తుండగా బుద్ధ కాలనీ సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ముంబై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ బెస్ట్‌కు చెందిన బస్సు సోమవారం రాత్రి పాదచారులను.. కొన్ని వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకుల లోపం వల్లే కుర్లాలో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. రూట్ నంబర్ 332లో వెళుతుండగా బెస్ట్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై నియంత్రణ కోల్పోయాడని ఆయన చెప్పారు.

ఆ తర్వాత రోడ్డుపై వెళ్తున్న వారిని బస్సు ముందుకు ఈడ్చుకెళ్లింది. బెస్ట్ అండర్‌టేకింగ్ బస్సు రెసిడెన్షియల్ సొసైటీని ఢీకొని ఆగిపోయిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 20 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని భాభా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు కుర్లా రైల్వే స్టేషన్‌ నుంచి అంధేరికి వెళ్తోందని చెప్పారు

Show Full Article
Print Article
Next Story
More Stories