Accident: జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం..లోయలోపడిన ఆర్మీ వాహనం..ఐదుగురు జవాన్లు మృతి

Accident: జమ్ముకశ్మీర్ లో ఘోర ప్రమాదం..లోయలోపడిన ఆర్మీ వాహనం..ఐదుగురు జవాన్లు మృతి
x
Highlights

Accident: జమ్ము కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆర్మీ జవాన్లకు తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. బల్నోయి ప్రాంతంలోని ఎల్ వోసీ వద్ద ఆర్మీ జవాన్లు...

Accident: జమ్ము కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఆర్మీ జవాన్లకు తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. బల్నోయి ప్రాంతంలోని ఎల్ వోసీ వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం 150 అడుగుల లోతైన లోయల్ పడిపోవడంతో ఐదుగురు జవాన్లు మరణించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 18 మంది జవాన్లు ఉన్నారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపెట్టింది. వారి సమాచారంతో అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. 6గురింకి గాయాలు కావాడంతో చికిత్స అందిస్తున్నారు. మరణించిన జవాన్ల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం సహాయచర్యలు చేపట్టింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాహనం లోయల్ పడటానికి ట్రాఫిక్ ప్రమాదమా లేదా వాతావరణ పరిస్థితుల ప్రభావమా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories