బైక్‌లకు మినహా అన్ని వాహనాలకు ఫాస్టాగ్‌

Fastag for all vehicles except bikes
x

ఫస్టాగ్ ఇమేజ్ 

Highlights

* మోటారు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు * N2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కుతున్న వాహనానికి.. * ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు

మీకు కారు ఉందా..? ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా? అయితే ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందే. ఫిబ్రవరి 15 నుంచి జాతీయ రహదారులపై టోల్‌ చెల్లింపులకు ఫాస్టాగ్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలకే అనుమతని మిగతా వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే ఫాస్టాగ్‌ ఎక్కడ చేయించుకోవాలి? ఎలా చేయించుకోవాలనే సందేహం ఉందా?

ద్విచక్రవాహనాలు మినహా అన్నీ వాహనాలకు ఫాస్టాగ్‌ను తప్పనిసరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానాన్ని 2017 నుంచి అమల్లోకి తీసుకొచ్చినా నగదు రూపంలోనూ చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అదేవిధంగా మోటరు వాహనాల నిబంధనల చట్టం 1989కి సవరణలు చేస్తూ 2017 డిసెంబర్‌ నుంచి కొత్తగా రోడ్డెక్కుతున్న ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు చేసింది.

అంతకంటే ముందు విక్రయించిన వాహనాలకు 2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి అంటూ కేంద్ర రవాణా శాఖ గతేడాది నవంబర్‌లోనే నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే వాహనదారుల సౌలభ్యం కోసం మరో నెలన్నరపాటు గడుపు పొడిగించారు. ప్రస్తుతం టోల్‌గేట్‌ దగ్గర నగదు చెల్లింపులు చేసే వాహనం కోసం ప్రత్యేకంగా లైన్‌ కేటాయించిన ఫిబ్రవరి 15 నుంచి వాహనదారులంతా తప్పనిసరిగా ఫాస్టాగ్‌ ద్వారానే టోల్‌ కట్టాలని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా 30వేల కేంద్రాల్లో ఫాస్టాగ్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేషనల్‌ హైవేల టోల్‌ప్లాజాల దగ్గర తప్పనిసరిగా లభించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్ష అమ్మకాలతోపాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, వంటి వాటిలో కూడా లభించేలా చర్యలు తీసుకున్నారు. భారత్‌ పే పేమెంట్స్‌ సిస్టమ్‌, యూపీఐ, ఆన్‌లైన్‌ చెల్లింపులు, మై ఫాస్టాగ్‌ మొబైల్‌ యాప్‌, పేటీఎం, గూగుల్‌ పే తదితర పోర్టల్స్‌తో రీఛార్జ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు.

మొత్తానికి ఫిబ్రవరి 15 నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరంటూ కేంద్రం స్పష్టం చేసినా కొన్ని టోల్‌ఫ్లాజాల దగ్గర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే తమకు తప్పనిసరి ఆదేశాలేవి ఇంకా రాలేదని టోల్‌ఫ్లాజా సిబ్బంది చెబుతున్నారు. దీంతో కేంద్రం ఫాస్టాగ్‌ అమలులో మళ్లీ గడువు పెంచుతుందేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories