ఈ చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం శూన్యం : రైతు సంఘాలు

ఈ చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం శూన్యం : రైతు సంఘాలు
x
Highlights

దేశం అట్టుడుకుతోంది. పొలం బాట పట్టాల్సిన రైతులు పోరు బాట పట్టారు. దేశవ్యాప్తంగా రైతులందరిది ఒకే నినాదం.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఈ నిరసన పంజాబ్‌లో పురుడు పోసుకొని రైతు ఉద్యమంగా అడుగులు వేస్తోంది.

దేశం అట్టుడుకుతోంది. పొలం బాట పట్టాల్సిన రైతులు పోరు బాట పట్టారు. దేశవ్యాప్తంగా రైతులందరిది ఒకే నినాదం.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి. ఈ నిరసన పంజాబ్‌లో పురుడు పోసుకొని రైతు ఉద్యమంగా అడుగులు వేస్తోంది. రైతులు వ్యవసాయ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ చట్టాల్లో ఏం ఉంది. ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో మూడు వ్యవసాయ చట్టాలకు సవరణలు చేసింది. ఈ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ రైతులు నవంబరు 26 నుంచి నిరసనలు చేపడుతున్నారు.

ఈ నిరసన చినికి చినికి గాలివానగా మారింది. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రైతుసంఘాలతో చర్చించినా ప్రయోజనం లేదు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 8న రైతు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, ఆప్, ఎన్సీపీ, టీఆర్ఎస్‌తో సహా 10కి పైగా ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్‌ కొనసాగుతోంది.

అయితే కొత్తగా అమలు చేసిన చట్టాలు రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. నిత్యవసర సరకుల చట్టం -1955కి కొన్ని సవరణలు చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యం తదితర కార్యకలాపాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది.

అలాగే రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార చట్టాన్ని తెరపైకి తెచ్చింది కేంద్రం. వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీలతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది. సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

రైతుల ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020ని కూడా అమలులోకి తీసుకువచ్చింది కేంద్రం. పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునే వీలు కల్పిస్తుందీ ఈ చట్టం. అలాగే కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఏ స్థాయిలోనైనా రైతుకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే రికవరీ కోసం వ్యవసాయ భూమిని తీసుకోవడానికి ఈ చట్టం అంగీకరించదు.

అయితే కనీస మద్దతు ధరను చట్టంలో చేర్చాలని, ప్రభుత్వ మార్కెట్ల నుంచి కొనుగోళ్లను కొనసాగించాలని ప్రస్తుత చర్చల్లో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు ఏమాత్రం ఉండదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలకే ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు.

అయితే ఈ చట్టాల ద్వారా పూర్తి ప్రయోజనం అందించలేకపోయినా గతంతో పోల్చితే రైతులకు ఎంతోకొంత మేలు చేసేవే'' అని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ, విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. రైతుల డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాలు రేపు ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories