22వ రోజుకు చేరిన రైతుల ఆందోళన

22వ రోజుకు చేరిన రైతుల ఆందోళన
x
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆందోళన 22వ రోజుకు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు...

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆందోళన 22వ రోజుకు చేరుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుతంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోతుంది. ఏ వివాదాన్నైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, దాని కోసం రైతులు, రైతు సంఘాల నేతలు ముందుకు రావాలని ప్రభుత్వం మరోసారి చెప్పింది. అయితే రైతులు మాత్రం దానికి ససేమిరా అంటున్నారు. ఇదివరకు జరిగిన చర్చల్లో చెప్పాల్సిందంతా చెప్పేశామని సర్కార్ కు మళ్లీ కొత్తగా చెప్పేది లేదని రైతులు స్పష్టం చేశారు.

మరోవైపు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు తమ దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. రుణభారంతో ఆత్మహత్యలు చేసుకున్న పంజాబ్ రైతుల కుటుంబీకులు టిక్రీ సరిహద్దులో నిరసనల్లో పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో ఆత్మహత్యలు మరింత పెరుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories