కేంద్రం, రైతు సంఘాల మధ్య ముగిసిన ఏడో విడత చర్చలు

కేంద్రం, రైతు సంఘాల మధ్య ముగిసిన ఏడో విడత చర్చలు
x
Highlights

కేంద్రం, రైతు సంఘాల మధ్య ఏడో విడత చర్చలు ముగిశాయి. నూతన సాగు చట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. కానీ అభ్యంతరాలపై...

కేంద్రం, రైతు సంఘాల మధ్య ఏడో విడత చర్చలు ముగిశాయి. నూతన సాగు చట్టాలను రద్దుచేసే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి తేల్చిచెప్పింది. కానీ అభ్యంతరాలపై అవసరమైన సవరణలకు సిద్ధమని చెప్పింది. అయితే, కేంద్రం తీరుపై రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం సవరణలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే, కొత్త సాగు చట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టం తెచ్చేవరకు వెనక్కి వెళ్లబోమని రైతు సంఘాలు మరోసారి వెల్లడించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories