ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం
x

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు తీవ్రతరం

Highlights

*పోరాటంలోకి యూపీ, రాజస్తాన్, ఉత్తరాఖండ్‌ రైతాంగం *బోర్డర్‌ పాయింట్ల వద్ద రైతు సంఘాల దీక్షలు

ఢిల్లీ రైతుల పోరాటం మళ్లీ ఊపందుకుంది. ట్రాక్టర్ పరేడ్ హింస తర్వాత కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపించిన రైతులు ఒక్కసారిగా ఆందోళనలు ఉదృతం చేశారు. పంజాబ్, హరయాణా రైతులకు మరో మూడు రాష్ట్రాల రైతులు జత కలిశారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

రైతుల ఆందోళనలతో ఢిల్లీ సరిహద్దులు హోరెత్తుతున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజు పరిణామాలతో వెనక్కు తగ్గినట్లే కనిపించిన రైతులు తాజాగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు పంజాబ్, మరియాణా రైతులే ఉద్యమంలో కీలకంగా వ్యవహరించగా.. తాజాగా వెస్ట్ యుపీ, ఉత్తరాఖండ్, రాజస్తాన్ రైతులు కూడా ఉద్యమానికి సై అన్నారు. దీంతో.. ఢిల్లీ–మీరట్‌ రహదారిపై ఉన్న ఘాజీపూర్‌ మరో రణరంగంగా మారిపోయింది.

మరోవైపు.. ఢిల్లీలో హింస తర్వాత స్వస్థలాలకు తిరిగి వెళ్లిన పంజాబ్, హరియాణా రైతులు మళ్లీ వెనక్కి వస్తున్నారు. సింఘు, టిక్రీ బోర్డర్‌ పాయింట్లకు చేరుకుంటున్నారు. రైతుల నిరసన కేంద్రాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీ దళాలనుమోహరించారు. ఢిల్లీలో రైతులు సాగిస్తున్న పోరాటానికి మద్దతుగా ఢిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులోని ముజఫర్‌నగర్‌లో శనివారం నిర్వహించిన మహాపంచాయత్‌లో రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక.. రెండు నెలలుగా కొనసాగుతున్న తమ పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. రైతుల శాంతియుత పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందన్న రైతు సంఘాల నేతలు.. ఇది రాజకీయ పోరాటం కాదని.. చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 2వ నాటికి మరింత మంది రైతులు ఉద్యమంలో పాల్గొంటారని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.

మరోవైపు.. జనవరి 26 నాటి హింసాత్మక దృశ్యాలను ప్రభుత్వం పదేపదే చూపుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టింస్తుందని నైతు సంఘాల నేతలు మండిపడ్డారు. శాంతియుతంగా ఉద్యమం జరుపుతున్న వేళ ఇంటర్నెట్ సేవలు నిలివేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి, కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ చర్చలకు పిలిస్తే తప్పకుండా హాజరవుతామన్న రైతులు.. ఢిల్లీ హింసపై పోలీసులు జారీ చేసిన నోటీసులకు సమాధానం చెస్తామన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories