రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుందా..?లేక అరాచక శక్తులు ప్రవేశించాయా?

farmers protest in delhi
x

farmers protest in delhi

Highlights

నిజంగానే రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుందా? కేంద్రం తీరుతో అన్నదాతలు ఆవేశానికి గురయ్యారా? అసలు, ట్రాక్టర్లతో విధ్వంసం సృష్టించింది రైతులేనా? లేక అరాచక...

నిజంగానే రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుందా? కేంద్రం తీరుతో అన్నదాతలు ఆవేశానికి గురయ్యారా? అసలు, ట్రాక్టర్లతో విధ్వంసం సృష్టించింది రైతులేనా? లేక అరాచక శక్తులా? రైతు సంఘాల నేతలు ఏమంటున్నారు? కేంద్రం రియాక్షన్ ఏంటి? కిసాన్ ర్యాలీలో అసలేం జరిగింది?

దేశ రాజధాని ఢిల్లీ రణరంగంగా మారింది. రైతుల ఆందోళనలతో హస్తిన అట్టుడికిపోతోంది. ఇన్నాళ్లూ శాంతియుతంగా సాగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రిపబ్లిక్-డే రోజు ఆందోళనకారులు రెచ్చిపోయారు. ట్రాక్టర్లతో విధ్వంసానికి దిగారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లు, వాహనాలనే కాదు. అడ్డుకున్న పోలీసులను కూడా ట్రాక్టర్లతో ఢీకొడుతూ ఢిల్లీలోకి ప్రవేశించారు. కిలోమీటర్ల పొడవునా వేలాది ట్రాక్టర్లతో దూసుకొస్తూ.... రహదారుల పక్కనున్న ఆస్తులను ధ్వంసం చేశారు. కొందరు ఆందోళనకారులు ఏకంగా ఎర్రకోటపైనే దాడి చేశారు. జాతీయ జెండాను మాత్రమే ఎగురవేయాల్సిన ఎర్రకోట‌పై రైతు జెండాను పాతారు. దాంతో, దేశ రాజధానిలో పరిస్థితులు అదుపుతప్పాయి.

అయితే, ఇన్నాళ్లూ శాంతియుతంగా ఆందోళనలు చేపట్టిన అన్నదాతలు.... సరిగ్గా దేశ గణతంత్ర దినోత్సవం రోజే ఎందుకు విధ్వంసానికి దిగారనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిజంగానే రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుందా? కేంద్రం తీరుతో అన్నదాతలు ఆవేశానికి గురయ్యారా? అసలు, ట్రాక్టర్లతో విధ్వంసం సృష్టించింది రైతులేనా? లేక... ర్యాలీలోకి అరాచక శక్తులు ప్రవేశించాయా? అంటే... అవుననే అంటున్నారు కిసాన్ మోర్చ నాయకులు. తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే.. అరాచక, అసాంఘిక, రాజకీయ శక్తులు తమ ర్యాలీలోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించాయని సంచలన ఆరోపణలు చేశారు.

అయితే, ఎర్రకోటపై దాడి, రైతు జెండా ఎగురవేయడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. భారత దేశ ప్రజాస్వామ్య హుందాతనానికి చిహ్నమైన ఎర్రకోటపై దాడి చేయడాన్ని కేంద్ర మంత్రులు ఖండించారు. దేశానికి గౌర‌వ‌ప్ర‌ద‌మైన క‌ట్ట‌డాన్ని అవ‌మానించ‌డం దురదృష్టకరమన్నారు. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కూడా ఎర్రకోటపై దాడిని ఖండించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories