Farmers Protest: రైతుల ఉద్యమానికి వంద రోజులు

Farmers Protest for a Hundred Days on the Delhi Border
x

ఢిల్లీ రైతుల ఆందోళన (ఫైల్ ఫోటో)

Highlights

Farmers Protest: సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నిరసనలు * ఢిల్లీ సరిహద్దులో వంద రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు

Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటం వంద రోజులకు చేరుకుంది. ఢిల్లీ సరిహద్దులోని సింఘు, టిక్రి ప్రాంతాల్లో నిరసన చేస్తున్నారు. అయితే.. రైతు సంఘాల నేతలకు ప్రభుత్వానికి చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. వీరిద్దరి మధ్య దాదాపు 11 సార్లు చర్చలు జరిపారు. రైతులు మాత్రం సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మరోవైపు వ్యవసాయ చట్టాలను విరమించుకునేందుకు కేంద్రం నిరాకరిస్తోంది.

కరోనా కంటే కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలు చాలా ప్రమాదకరమని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ వైరస్ ఉధృతి తీవ్రంగా పెరుగుతున్నా రైతులు పట్టించుకోకుండా పోరాడుతున్నారు. ఈ చట్టాలు కార్యరూపం దాల్చితే రైతులకు ఏం మిగలదాని మొత్తం కార్పొరేట్ మయం అవుతుందని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాల్టీ నుంచి మరింత పకడ్బందీగా తమ కార్యచరణ ఉంటుందని రైతు సంఘాలు ప్రకటించాయి. కేంద్రం దిగి వచ్చేంత వరకు తమ పోరు ఆగదని స్పష్టం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories