Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల నిరసనలు

Delhi: Farmers Protest and Observe Black Day
x

Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతోన్న రైతుల నిరసనలు

Highlights

Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.

Delhi: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న ఆందోళనలు ఇవాళ్టికి ఆరు నెలలు పూర్తి చేసుకోవడంతో రైతులు బ్లాక్‌డేగా పాటిస్తున్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో శాంతియుతంగా నిరసనలు తెలపాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. దీంతో ఎవరి ఇళ్లలో వారు నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలుపుతున్నారు.

అయితే ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న రైతులు టిక్రీ, సింఘు బోర్డర్‌లో బైఠాయించారు. నల్ల జెండాలు చేతిలో పట్టుకుని నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ బార్డర్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories