నూతన వ్యవసాయ చట్టాలను సపోర్ట్ చేసిన ప్రధాని మోడీ

నూతన వ్యవసాయ చట్టాలను సపోర్ట్ చేసిన ప్రధాని మోడీ
x
Highlights

నూతన వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి మోడీ సపోర్ట్ చేశారు. కొత్త చట్టాలు కష్టాల్ని దూరం చేసి రైతులకు కొత్త అవకాశాలు, హక్కుల్ని కల్పిస్తాయని ప్రధాని మోడీ...

నూతన వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి మోడీ సపోర్ట్ చేశారు. కొత్త చట్టాలు కష్టాల్ని దూరం చేసి రైతులకు కొత్త అవకాశాలు, హక్కుల్ని కల్పిస్తాయని ప్రధాని మోడీ అన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే పార్లమెంట్‌లో వాటికి చట్టబద్దత లభించిందని వెల్లడించారు. తక్కువ సమయంలో రైతులు అధిక లాభాలను అందుకుంటారని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త చట్టాల ప్రకారం పంట కొనుగోలు పూర్తయిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలని ప్రధాని గుర్తు చేశారు. లేని పక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు. రైతుల ఫిర్యాదులను జిల్లా సబ్‌ డివిజనల్ మెజిస్ట్రేట్ నెలలోపు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. జితేంద్ర సింగ్‌ అనే రైతు ఇటీవల ఫిర్యాదు చేయగా.. నెల లోపే ఆయన సమస్యను పరిష్కరించారని ప్రధాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories