Exit Polls: అంచనాలే నిజమవుతాయా..? ఫలితాలపై పార్టీల్లో ఉత్కంఠ

EXIT POLLS 5 States
x

EXIT POLLS

Highlights

Exit Polls: అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సంగంతి తెలిసిందే. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు నిజమౌతాయా?

Exit Polls: బెంగాల్ లో జరిగిన చివరి దశ పోలింగ్ తో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఫలితాల మీదే అందరి దృష్టి ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది..? ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం బెంగాల్ లో దీదీ.. అసోంలో బీజేపీ.. తమిళనాట డీఎంకే.. పుదుచ్చేరిలో ఎన్నార్ కాంగ్రెస్.. కేరళలో ఎల్డీఎఫ్ దే అధికారమని తేల్చాయి. ఈ అంచనాలే నిజమవుతాయా..? లేక తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయా.. ? ఇదే..ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఫలితాలపై ఆసక్తి పెంచుతోంది.

అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొందని, నువ్వా–నేనా అన్నట్లుగా పరి స్థితి ఉందని గురువారం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. ఇండియా టుడే– యాక్సిస్‌ సర్వే బీజేపీకి 134–160 సీట్లు, టీఎంసీకి 130–156 సీట్ల దాకా వస్తాయని తెలిపింది. రిపబ్లిక్‌– సీఎన్‌ఎక్స్‌ టీఎంసీకి 128-138, బీజేపీ(138-148)కే అధికస్థానాలు వస్తాయని తేల్చింది. అయితే టైమ్స్‌ నౌ– సీ ఓటర్ తృణమూల్(158), బీజేపీకీ 115, ఏబీపీ– సీ ఓటర్‌ ఎగ్జిట్‌పోల్స్‌ మాత్రం తృణమూల్‌(152-164) సాధారణ మెజారిటీ సాధిస్తుందని, 109పైచిలుకు స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాయి.

దీదీకి స్వల్పమొగ్గు ఉంటుందని ఈ రెండు సంస్థలు తేల్చాయి. ఎగ్జిట్‌పోల్స్‌ ఓటరు నాడిని ఏమేరకు ప్రతిఫలిస్తాయో చూడాలి. వామపక్షాలు– కాంగ్రెస్‌ కూటమి దారుణంగా దెబ్బతిననుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ తేల్చిచెప్పాయి.

తమిళనాడులో డీఎంకే హవా కోనసాగుతుందని తేల్చి చెప్పాయి. డీఎంకే కూటమికి 175–195 స్థానాలు వస్తాయని, అన్నాడీఎంకే కూటమి 38 నుంచి 54 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టుడే పేర్కొంది. టైమ్స్‌ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్‌– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ అధికార పార్టీకి షాక్ తప్పేలా లేదని చెప్పాయి.

అస్సాంలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్‌ తెలిపింది. మొత్తం 126 స్థానాల్లో బీజేపీ కూటమికి 75–85 స్థానాలు, కాంగ్రెస్‌ కూటమికి 40 నుంచి 50 స్థానాలు వస్తాయని పేర్కొంది. టైమ్స్‌ నౌ– సీ ఓటర్, రిపబ్లిక్‌– సీఎన్‌ఎక్స్‌తో సహా అన్ని సంస్థలూ బీజేపీకే మొగ్గు ఉన్నట్లు పేర్కొన్నాయి.

కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు జరిగాయి. ఎల్‌డీఎఫ్‌కు సాధారణ మెజారిటీ (71) కంటే ఎక్కవే సీట్లు వస్తాయని ప్రతి సంస్థా చెప్పడం గమనార్హం. ఎల్‌డీఎఫ్‌కు ఏకంగా 104– 120 స్థానాలు వస్తాయంది. కేరళలో సీపీఎం సర్కార్ కి ఢోకా ఏమీ లేదని ఎగ్జిట్ పోల్ అంచనాలు తేల్చేశాయి. ఎల్డీఎఫ్ యే కేరళలో తిరిగి అధికారంలోకి వస్తుందని మొదటి నుండి సర్వేలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నాయి.దీంతో సీపీఎం భాగస్వామ్య పక్షాల్లో ఆనందం తాండవిస్తోంది. ఈ అంచనాలు యూడీఎఫ్ లో తీవ్ర నిరాశను నింపాయి.

పుదుచేరి మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ కూటమికి 19-23, ఎస్డీఏ కూటమికి 6-10 వస్తాయని ఏబీపీ సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ 16-20 ..ఎస్డీఏ కూటమికి11-13 స్థానాలు వస్తాయని స్ఫష్టం చేసింది.

గతంలో అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే తాజా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై పలు పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. బెంగాల్ లో బిజేపీనే విజయం సాధింస్తుందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో అయితే అధికార పార్టీ అభ్యర్థులు మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెబుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం స్టాలిన్ నేతృత్వంలోనే డీఎంకే అధికారం కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories