టీకాలు రావడం కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు-మోదీ

టీకాలు రావడం కొవిడ్‌పై యుద్ధంలో కీలక మలుపు-మోదీ
x
Highlights

కోవిడ్‌ నిరోధానికి అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది.

కోవిడ్‌ నిరోధానికి అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత్‌లో ఆమోదం లభించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ సంస్థ ..డీసీజీఐ వ్యాక్సిన్‌కు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. ఈ టీకా భద్రమైనదని ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. కొవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని డీసీజీఐ పేర్కొంది. డీసీజీఐ ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు, ప్రజలకు ఊరట కలిగిస్తోంది.

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. ఐసీఎంఆర్‌, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ను రూపొందించాయి. అలాగే ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది.

అంతకుముందు ఈ రెండు టీకాలకు అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వాలని ఔషధ నియంత్రణ సంస్థ ..డీసీజీఐకు ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ..సీడీఎస్‌సీవో సిఫార్సు చేసింది. దానికనుగుణంగా నేడు డీసీజీఐ తుది అనుమతులను జారీ చేసింది. టీకా ఉత్పత్తి, పంపిణీ అంశాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది.

సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రధాని స్పందించారు. భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కొవిడ్‌పై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశప్రజలకు, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారు కావడం గర్వకారణమని ప్రధాని అన్నారు. మన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మిగిలిన కరోనా వారియర్స్‌ దేశ కష్టకాలంలో చేసిన సేవలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎంతోమంది ప్రాణాలను కాపాడినందుకు మనందరం వారికి రుణపడి ఉంటామని మోడీ ట్వీట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories