57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల

Elections to 57 Rajya Sabha Seats on 10 June
x

57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల

Highlights

Rajya Sabha: దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Rajya Sabha: దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. జూన్ 10న పోలింగ్.. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రుగుతాయి.

యూపీలో 11, ఏపీలో 4, రాజ‌స్థాన్ లో 4, చ‌త్తీస్‌ఘ‌డ్ లో 4, జార్ఖండ్ లో 2, మ‌హారాష్ట్రలో 6, త‌మిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్త‌రాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హ‌ర్యానాలో రెండు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మూడు, ఒడిశాలో3 స్థానాలు ఉన్నాయి. ఏపీ నుంచి ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి లక్ష్మీకాంత్, ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్‌ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories