మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా!

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా!
x
Highlights

-మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ -రెండు రాష్ట్రాలతో పాటు 64 అసెంబ్లీ స్ధానాల్లో ఉప ఎన్నికలు -తెలంగాణలో హుజూర్ నగర్‌ స్ధానానికి ఉప ఎన్నిక కర్నాటకలో 15 అసెంబ్లీ స్ధానాల్లో ఉప ఎన్నికలు -ఈనెల 27న విడుదల కానున్న నోటిఫికేషన్ -అక్బోబర్ 4 ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ -అక్టోబర్‌7తో ముగియనున్ననామినేషన్ల ఉపసంహరణ గడువు -అక్టోబర్‌ 21న ఒకే విడతలో ఎన్నికలు -అక్టోబర్‌ 24 ఫలితాల వెల్లడి

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. నవంబర్ 2వ తేదీన హర్యానా, నవంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీ గడుపు ముగియనుందని తెలిపారు. ఈ నెల 27న రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 4 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అక్టోబర్ 21న రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడతాయని తెలిపారు. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హర్యానాలో 1.28 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడిచారు. ఎన్నికల ఖర్చు పరిశీలనకు పరిశీలకులను నియమిస్తామని తెలిపారు. ఒక్కో అభ్యర్థి 28 లక్షల రూపాయిలు వరకు మాత్రమే ఖర్చు చేయాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ఒక్క కాలం పూర్తి చేయకపోయినా, నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని చెప్పారు. క్రిమినల్ రికార్డు ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలను సమర్పించాని తెలిపారు.







Show Full Article
Print Article
More On
Next Story
More Stories