Election Commission: ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలా? వద్దా?

Election Commission extends ban on poll rallies, roadshows till January 22
x

 ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి అనుమతివ్వాలా? వద్దా?

Highlights

Election Commission: నేడు నిర్ణయం తీసుకోనున్న కేంద్ర ఎన్నికల సంఘం

Election Commission: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు కరోనా కేసుల వ్యాప్తితో నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? కొవిడ్ కారణంగా ప్రచారం విషయంలో ఏం చేయాలి? అన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘం నేడు సమావేశం కానుంది. ఐదు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి కూడా పాల్గొంటారు.

ఇవాళ జరిగే సమావేశంలో ఎన్నికల ప్రచారానికి అనుమతించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కోవిడ్ పరిస్థితులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీయనుంది. అంతకుముందు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రోడ్‌షోలు, ర్యాలీలపై నిషేధాన్ని జనవరి 22 వరకు పొడిగించింది. అయితే, 300 మంది వ్యక్తులతో లేదా హాల్ సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం రాజకీయ పార్టీల ఇండోర్ సమావేశాలకు అనుమతినిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories