Breaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

Eknath Shinde to be the Maharashtra Chief Minister
x

Breaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

Highlights

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర...

Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని మహారాష్ట్ర బీజేపీ ముఖ్య నేత ఫడణవీస్ ప్రకటించారు. మహారాష్ట్ర 20వ సీఎంగా ఏక్‌నాథ్‌ షఙండే ఈరోజు(గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు ఫడ్నవీస్‌ సీఎం.. ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు.

కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు. సీఎం పదవిని ఫడణవీస్ చేపట్టకపోవడం వెనుక బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసిట్టు తెలిసింది. ఇన్నాళ్లుగా నడిచిన ఈ 'మహా' సంక్షోభంలో బీజేపీ పాత్ర ఏం లేదని చెప్పుకునే ఉద్దేశంతోనే బీజేపీ షిండేను సీఎంగా ప్రకటించి ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories