నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే సర్కార్‌కు బలపరీక్ష

Eknath Shinde Faces Test To Prove Majority Today
x

నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే సర్కార్‌కు బలపరీక్ష

Highlights

*బలపరీక్షకు ఆదేశించిన గవర్నర్ భగత్‌సింగ్

Maharashtra Floor Test: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే బల పరీక్షకు సిద్ధమయ్యారు. ఇవాళ షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోనుంది. ఈ మేరకు తనకు మద్దతిస్తున్న నేతలతో షిండే మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ నేతలతో పాటు శివసేన నేతలతో మాట్లాడి పలు అంశాలపై చర్చించారు. నిన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి నర్వేకర్ 164 ఓట్లతో గెలవగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రాజల్ సాల్వీ 107 ఓట్లు మాత్రమే తెచ్చోకోగలిగారు. దీనిని బట్టి 287 మంది సభ్యులున్న సభలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసిపోతోంది. ఇవాళ జరగబోయే బల పరీక్షలోనూ ఫలితం ఇలాగే ఉంటుందని, స్పీకర్ ఎన్నికలోనే ముందస్తు విజయం లభించిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం ఉత్సాహంతో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories