Delhi: ఢిల్లీలో తగ్గని వాతావరణ కాలుష్యం.. వారం రోజులుగా స్కూల్స్‌ బంద్‌

Educational Department has Imposed not Open Schools Until Further Notice
x

ఢిల్లీలో తగ్గని వాతావరణ కాలుష్యం(ఫైల్ ఫోటో)

Highlights

*విద్యాశాఖ నుంచి ప్రకటన విడుదలయ్యేవరకు నో స్కూల్స్‌ *వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న ప్రభుత్వాధికారులు

Delhi: ఢిల్లీలో వాతావరణ కాలుష్యం విద్యార్థులను వీడడం లేదు. స్కూళ్లు మూసి వారం రోజులు గుడుస్తున్నా, ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో ప్రకటన చేసే వరకు ఎవరు స్కూళ్లు ఓపెన్‌ చేయవద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరికొద్ది రోజులపాటు పాఠశాలలు మూతపడనున్నట్లు తెలుస్తోంది. అటు ప్రభుత్వ అధికారులు కూడా వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు.

మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యవసర పరిస్థితి తలపిస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌డౌన్‌ విధించే ప్రతిపాదననూ పరిశీలించాలని కోరింది. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories