ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్, విజయ్‌ నాయర్ ఈడీ కస్టడీ పొడిగింపు

ED officials increased The speed in Delhi liquor scam
x

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్, విజయ్‌ నాయర్ ఈడీ కస్టడీ పొడిగింపు

Highlights

Enforcement Directorate: రూ.30 కోట్లను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించారు

Enforcement Directorate: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత దూకుడు పెంచింది. లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌ల ఐదు రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. అయితే మరో 9 రోజులు ఈడీ కస్టడీ కావాలంటూ ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాయితే వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు 5రోజులు ఈడీ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.100 కోట్ల ముడుపుల్లో అభిషేక్ బోయినపల్లి కీలక పాత్రధారిగా ఉన్నారు. వంద కోట్ల ముడుపులో 30 కోట్ల రూపాయలను అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గం ద్వారా తరలించినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో బుచ్చిబాబు సహా మరికొందరిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి సహా మరికొందరిని ప్రశ్నించాల్సి ఉందని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో వేసిన ఈడీ కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories