Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సన్నిహితులకు నోటీసులు

Notices to Arvind Kejriwal Friend
x

Delhi Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సన్నిహితులకు నోటీసులు

Highlights

Delhi Liquor Scam: విజయ్‌నాయర్‌ మధ్యవర్తిగా వ్యవహరించారని ఛార్జ్‌షీట్‌‌లో పేర్కొన్న ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్ ఈడీ ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటుండగా తాజాగా ఈ సెగ ముఖ్యమంత్రిని తాకింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఉప ముఖ్యమంత్రి సిసోదియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై చేపట్టిన విచారణల్లో భాగంగా ఇప్పటికే పలు అరెస్టులు చోటుచేసుకున్నాయి. ఈడీ, సీబీఐ వేర్వేరుగా విచారణలు జరుపుతున్నాయి. సిసోదియా సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌ బాబు, సమీర్‌ మహేంద్రు సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ ఇప్పటికే సీబీఐ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తాజాగా మరోసారి సిసోదియాకు సమన్లు ఇచ్చింది. వచ్చే ఆదివారం ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కేసులో కేజ్రీవాల్‌ పీఏను ఈడీ ప్రశ్నించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories