ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

ED Found huge cash in Washing Machine
x

ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

Highlights

ED: రూ.1800 కోట్ల అనుమానిత చెల్లింపులు గుర్తింపు

ED: ఫారెన్ ఎక్స్చేంజ్ చట్టాన్ని ఉల్లంఘించి పెద్ద మొత్తంలో నగదును విదేశాలకు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న ఈడీ.. కొన్ని రోజులుగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాతో పాటు కురుక్షేత్ర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇందులో భాగంగా లెక్కాపత్రంలేని 2కోట్ల5లక్షల నగదును ఈడీ గుర్తించింది. అందులో కొంత నగదును వాషింగ్ మెషిన్‌లో కనుగొన్నామని ఈడీ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా పలు ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలు, వాటి డైరెక్టర్ల కార్యాలయ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించినట్టు ఈడీ తెలిపింది. ఈ కంపెనీల భాగస్వాములుగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. సోదాల్లో పలు అనుమానిత పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటనలో ఈడీ పేర్కొంది.

నగదు తరలింపులో ప్రమేయం ఉన్న సంస్థలకు సంబంధించిన మొత్తం 47 బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేశామని ఈడీ అధికారులు వివరించారు. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం దాటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని ఈడీ పేర్కొంది. సోదాలు జరిపిన కంపెనీల భాగస్వాములు సింగపూర్ గెలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హారిజోన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌ కంపెనీలకు అనుమానాస్పద రీతిలో 1,800 కోట్ల మేర చెల్లింపులు చేసినట్టుగా గుర్తించామని ఈడీ అధికారులు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories