Punjab: పంజాబ్ సీఎం మేనల్లుడు అరెస్ట్

ED Arrests Punjab CMs Nephew Bhupinder Singh Honey in Money Laundering Case
x

పంజాబ్ సీఎం మేనల్లుడు అరెస్ట్

Highlights

Punjab: మనీలాండరింగ్ కేసులో భూపేందర్‌సింగ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

Punjab: పంజాబ్‌లో ఈడీ దూకుడు కొనసాగిస్తుంది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ చట్టం కింద సీఎం చన్నీ మేనల్లుడిని అరెస్టు చేసింది. ఎనిమిది గంటలపాటు విచారించిన తర్వాత గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. వైద్య పరీక్షల తర్వాత మొహాలీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.

సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్‌ సింగ్‌ హనీపై ఇసుక అక్రమ మైనింగ్‌ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గత నెల 18న భూపిందర్‌ సింగ్‌ ఇంటితోపాటు మరో పదిచోట్ల దాడులు నిర్వహించింది. ఇందులో భూపిందర్‌ ఇంట్లో 7.9 కోట్లు, అతని సహచరుడు సందీప్‌ కుమార్‌, కుద్రదీప్‌ సింగ్‌ ఇళ్లల్లో2 కోట్లు సీజ్‌ చేసింది. ఈ ముగ్గురు ప్రొవైడర్స్‌ ఓవర్సీస్‌ సర్వీసెసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని ఈడీ గుర్తించింది. దీంతో వారిపై అక్రమ మైనింగ్‌ వ్యవహరంలో మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

ఎన్నికల ముందు సీఎం చన్నీ మేనల్లుడిని ఈడీ అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమయింది. 117 సీట్లున్న పంజాబ్‌ అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories