ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో ఈ ఏడాది మార్పుల్లేవు

Economically Weaker Section Quota Rules Will Change Next Year Says Central Government
x

ఈడబ్ల్యూఎస్‌ కోటా నిబంధనల్లో ఈ ఏడాది మార్పుల్లేవు

Highlights

EWS: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి.

EWS: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన అంశంపై ఇప్పటికీ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నీట్ పీజీ పరీక్షల్లో EWS కోటాపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. EWS కోటా నిబంధనల్లో ఈ ఏడాది ఎలాంటి మార్పు ఉండదని కేంద్రం వెల్లడించింది. EWS లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను ఈ విద్యా సంవత్సారానికి అలాగే ఉంచుతామని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టులకు తెలిపింది.

ఈ పిటిషన్ విచారణ ఈనెల 6న జరగాల్సి ఉంది. ఈ సంవత్సరానికి EWS కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షలుగానే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ నిబంధన వల్ల లబ్ధి పొందుతున్న వారిలో చాలా మంది 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారేనని తెలిపింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్న ఈ సమయంలో నిబంధలను మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొంది. అయితే వచ్చే ఏడాది సవరణలు చేస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories